News February 11, 2025

రేపల్లె: న్యాయవాది ప్రభాకరరావు మృతి

image

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె కోశాధికారి ప్రముఖ సోషల్ వర్కర్ అడిషనల్ ప్రభాకర్ రావు గుండెపోటుతో మృతి చెందారు. రేపల్లె ప్రాంత ప్రజలకు న్యాయవాదిగా, సోషల్ వర్కర్‌గా ఆయన సుపరిచితుడు. రెడ్ క్రాస్‌కు ప్రభాకర్ రావు చేసిన సేవలు ఎనలేనివని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ వసంతం వీర రాఘవయ్య అన్నారు. రెడ్ క్రాస్ బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ రావుకు నివాళులర్పించారు.

Similar News

News March 14, 2026

రాజధాని అమరావతి రైతులకు APCRDA విజ్ఞప్తి

image

అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” కార్యక్రమం మార్చి 14న తాత్కాలికంగా రద్దు చేశారు. రెండవ శనివారం కావడంతో నిర్వహణ కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 14, 2026

రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చోప్రా

image

IPL-2026లో MI తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్‌గా కాకుండా పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. రోహిత్ ప్రస్తుతం గతంలో కంటే ఫిట్‌గా ఉన్నారని, ఆయన సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్దిక్‌కు హెల్ప్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేశారు.

News March 14, 2026

కోదాడలో కల్తీ వంటనూనె కలకలం

image

కోదాడ పట్టణంలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు. కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రజలు ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.