News October 21, 2024
రేపు అనంతపురానికి సినీ నటుడు నాగార్జున

సినీ నటుడు అక్కినేని నాగార్జున రేపు అనంతపురానికి వస్తున్నారు. నగరంలో రేపు జరగనున్న ఓ జువెలర్స్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ‘నేను అనంతపురం వస్తున్నా. రేపు అందరం కలుసుకుందాం’ అంటూ నాగార్జున ఓ వీడియో విడుదల చేశారు. సూర్య నగర్‌లో రేపు ఉదయం 11:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
Similar News
News March 7, 2026
100% పంటల సాగు వివరాలు ఈ-క్రాప్‌లో నమోదు: JDA రవి

రబీ 2025-26 సీజన్ ఈ-క్రాప్ సవరణ కోసం ఇది చివరి అవకాశం ఈనెల 16న జరగుతుందని, ఆ తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవని JDA రవి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 100% పంటల సాగు వివరాలు ఈ-క్రాప్‌లో నమోదు చేశామన్నారు. ఖరీఫ్-2025కు సంబంధించి మన జిల్లాలో ఇప్పటివరకు 100 శాతం సర్వేలో భాగంగా 5,91,938 రైతుల LP నంబర్లలో సర్వే చేశామన్నారు.
News March 7, 2026
రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలో అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆనంద్ తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో వయసుకు తగ్గ ఎత్తు, బరువు పిల్లలు ఉన్నారా, లేదా అని పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారా అంటూ ఆరా తీశారు. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మంచి భోదన అందజేయాలన్నారు.
News March 7, 2026
అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో వడ్డించే అల్పాహారం నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. అక్కడ అందుతున్న సేవలపై నేరుగా ప్రజలను అడిగి ఆరా తీశారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.


