News August 22, 2024

రేపు అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటన

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలిన ఘటనలో గాయపడి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు విశాఖ చేరుకుంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకొని 11గంటలకు క్షతగాత్రులను జగన్ పరామర్శించనున్నారు.

Similar News

News December 5, 2025

విశాఖ: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

image

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ CI లక్ష్మణ రావు తెలిపారు.

News December 4, 2025

విశాఖ: క్రికెటర్ ‌కరుణ కుమారికి ఘన సత్కారం

image

అంధుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అంధుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్‌కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్‌కు అనుగుణంగా క‌రుణ‌కుమారికి ప్ర‌త్యేకంగా రెండు క్రికెట్ కిట్లకు రూ.50వేలు ఇవ్వడం జరిగిందన్నారు. భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపిన ఆమెకు ప్రోత్సాహకంగా క‌లెక్ట‌ర్ రూ.లక్ష చెక్ అందజేశారు

News December 4, 2025

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ: హోం మంత్రి

image

మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖకు గుర్తింపు పొందిన సందర్భంగా బీచ్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. హోం మంత్రి అనిత పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. మహళల భద్రతే ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యమని, సంఘటన జరిగిన వెంటనే శిక్షలు పడుతున్నాయన్నారు. శక్తి టీమ్స్, యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. విశాఖకు జాతీయ స్థాయిలో ప్రఖ్యాతలు తీసుకువచ్చిన పోలీసులను మంత్రి అనిత అభినందించారు.