News March 29, 2025

రేపు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు సీఎం

image

సీఎం చంద్రబాబు రేపు (ఆదివారం) కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఉగాది సంబరాలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.

Similar News

News October 22, 2025

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి – కలెక్టర్

image

జిల్లాలో నెలకొన్న పలు రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో అర్హత గల లబ్ధిదారులను గుర్తించాలన్నారు.

News October 22, 2025

MTM : ప్రారంభమైన కార్తీక మాసం.. సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లు

image

కార్తీక మాసం సందర్భంగా సముద్ర పుణ్య స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాసం నెల రోజులపాటు సముద్రంలో పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది సముద్ర స్నానాలు ఆచరిస్తారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంకు సమీపంలో ఉన్న మంగినపూడి బీచ్ నెల రోజుల పాటు భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు బీచ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 22, 2025

కృష్ణా: జగన్‌ను కలిసిన వైసీపీ నేతలు

image

తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, రూహుల్లా, అరుణ్ కుమార్ తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డితో సమగ్రంగా చర్చించారు.