News June 7, 2024
రేపు ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తా: ఏవీఎం

2024 సార్వత్రిక ఎన్నికలలో సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరాజయం చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ శనివారం సురుటుపల్లి ఆలయ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఏవీఎం బాలాజీ రెడ్డి తెలిపారు. తనతో పాటు పాలకమండలి సభ్యులు సైతం రాజీనామా చేయనున్నారని తెలిపారు. ఆలయ ఛైర్మన్గా పనిచేసిన పదవీకాలంలో తనకు సహకరించిన రాజకీయ ప్రతినిధులకు, ఆలయ సిబ్బందికి, అధికారులకు, ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 4, 2025
చిత్తూరు: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియమిస్తామని డీఈవో వరలక్ష్మి చెప్పారు. జిల్లాలో 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు.
News December 4, 2025
చిత్తూరు జిల్లాలో CIల బదిలీ

చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు అర్బన్ సీఐ కె.మురళీమోహన్ను స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ చేశారు. పూతలపట్టు అర్బన్ సీఐ కృష్ణ మోహన్ను వీఆర్కు పంపారు. చిత్తూరులో వీఆర్లో ఉన్న డి.గోపిని పూతలపట్టు అర్బన్ సీఐగా నియమించారు.
News December 4, 2025
రాష్ట్ర స్థాయి విజేతలుగా చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు

గుంటూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల (పారా స్పోర్ట్స్)పాఠశాల బ్యాడ్మింటన్ మీట్లో రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించారు. డిసెంబర్ 1, 2వ తేదీల్లో నిర్వహించిన ఈ క్రీడల్లో చిత్తూరు దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తన ఆఫీసుకు ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు.


