News February 9, 2025

రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ: కలెక్టర్

image

ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను వేయాలని సూచించారు. ఏదైన కారణాతలో హాజరు కాని వారికి 17న మరోసారి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News November 16, 2025

రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ నాగరాజు

image

మెదక్ జిల్లాలో జిన్నింగ్(పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. కావున సమస్య పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని జిల్లా మార్కెటింగ్ అధికారి కే.నాగరాజు సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.

News November 16, 2025

ఏలూరులో డెడ్ బాడీ కలకలం

image

ఏలూరు రెండో పట్టణ పరిధిలోని బడేటి వారి వీధిలో ఓ దుకాణం ఎదుట డెడ్ బాడీ ఆదివారం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్ఐ మధు వెంకటరాజా పరిశీలించి అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇతడి వివరాలు తెలిసిన వారు ఏలూరు టూ టౌన్ సీఐ 94407 96606, టూ టౌన్ ఎస్ఐ 99488 90429 నంబర్లకు సంప్రదించాలన్నారు.

News November 16, 2025

రేపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

image

నందికొట్కూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10 ఆపై చదివినవారు అర్హులన్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీతం రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల లోపువారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.