News February 26, 2025

రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్: కలెక్టర్

image

నల్గొండ – ఖమ్మం- వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని పేర్కొన్నారు.19 మంది పోటీలో ఉండగా నల్గొండ జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 15, 2025

యాదాద్రి: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

image

యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తిమ్మాపూర్‌కు చెందిన చామల రమే‌శ్‌గా గుర్తించారు.

News March 15, 2025

VZM: కన్న తండ్రి ముందే విషం తాగి మృతి

image

దొంగతనం నింద తనపై మోపారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు కన్న తండ్రి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భోగాపురం మండలం అమకాంలో ఈనెల 11న చోటుచేసుకోగా సదరు యువకుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్న అప్పలనాయుడు.. టూరిస్ట్ సెల్ ఫోన్ దొంగలించాడని యాజమాన్యం నిందించడంతో అవమానంగా బావించి పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

News March 15, 2025

చిత్రాడలోని జనసేన సభపై మీ కామెంట్

image

పిఠాపురంలోని చిత్రాడలో ‘జనసేన జయకేతం’సభ విజయవంతంగా ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్‌తో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అయితే తన ప్రసంగంలో స్థానిక అంశాలపై పెద్దగా ఫోకస్ చేయలేదని లోకల్ ప్రజలు అంటున్నారు. హిందీ మన భాష, వైసీపీపై విమర్శలు, నిలిచాం.. టీడీపీని నిలబెట్టాం అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి పవన్ చిత్రాడ సభపై మీరెలా ఫీలయ్యారు. కామెంట్ చేయండి..

error: Content is protected !!