News February 8, 2025
రేపు ఏలూరు అంబికా థియేటర్‌కు తండేల్ చిత్ర యూనిట్

హీరో నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం విజయ యాత్రలో భాగంగా ఆదివారం ఏలూరు అంబికా థియోటర్‌కు చిత్ర యూనిట్ రానున్నట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటలకు థియేటర్‌కు హీరో నాగచైతన్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హాజరవుతారని తెలిపారు.
Similar News
News March 23, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

గుంతకల్లు ఈద్గా మైదానంలో ఉపవాస దీక్షాపరులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ముందుగా మసీదులో సామూహిక ప్రార్థనలో నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షాపరులకు ఫలహారాలు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఉపవాస దీక్షపరుల కోసం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే, ఎంపీ ప్రారంభించారు.
News March 23, 2025
పంట నష్టం అంచనా వేయండి: అచ్చెన్న

AP: రాష్ట్రంలో కురిసిన వడగళ్ల వానపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాయలసీమ జిల్లాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించాలని, నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. అలాగే అన్నదాతలకు అందుబాటులో ఉంటూ తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
News March 23, 2025
నిజామాబాద్‌లో పలువురి ఘర్షణ

నిజామాబాద్ నగరంలో ఆదివారం కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగగా కత్తి పోట్లు జరిగాయని పుకార్లు షికార్లు చేశారు. వివరాల్లోకి వెళితే మిర్చి కాంపౌండ్‌లో హబీబ్ నగర్‌కు చెందిన మహమ్మద్‌కు మిర్చీ కాంపౌండ్‌కు చెందిన అజ్జుకు, మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తోపులాటలో మహమ్మద్‌కు అక్కడ ఉన్న ఓ ఇనుప రాడ్డు గుచ్చుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.