News March 16, 2025
రేపు ఓయూ బంద్కు ఏబీవీపీ పిలుపు

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలపై నిషేధం విధిస్తూ ఓయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. యూనివర్సిటీల్లో నియంతృత్వ పోకడలు సరికాదని పేర్కొంది. ఓయూలో ఉద్యోగ భర్తీ, నిధుల కొరత, విద్య నాణ్యత, ఆహార నాణ్యత తదితరాంశాలపై దృష్టి సారించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.
Similar News
News October 21, 2025
HYD: మెట్రో స్వాధీన ప్రక్రియ.. FY 2025-26 ముగింపులోపే కొలిక్కి!

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా దీనికి ఒక రూపు తేవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా మెట్రో రైల్ ఆర్థిక వ్యవహారాలపై స్టడీ చేయించాలని నిర్ణయించింది. దానికి ఉన్న భూములు, ఆస్తులు, షాపింగ్ మాల్స్ తదితరాల విలువపై దృష్టి సారించింది.
News October 21, 2025
HYD: ‘డిసెంబర్ 6లోపు వక్ఫ్ ఆస్తులు అప్డేట్ చేయాలి’

సెంట్రల్ వక్ఫ్ కమిటీ ఆదేశాల మేరకు డిసెంబర్ 6వ తేదీలోపు వక్ఫ్ ఆస్తుల డేటాను ఉమీద్ పోర్టల్లో అప్డేట్ చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీలకు, ముతవల్లీలను కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వక్ఫ్ కమిటీ కార్యాలయం తగిన సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. HYD నాంపల్లిలోని వక్ఫ్ కార్యాలయంలో ముతవల్లీలు, మేనేజ్మెంట్ కమిటీలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.
News October 21, 2025
అమరవీరుల స్తూపానికి సైబరాబాద్ సీపీ నివాళి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు కొండాపూర్లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అమరవీరుల స్మారకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించారు. రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జోన్ డీసీపీలు, అధికారులు పాల్గొన్నారు.