News July 10, 2024

రేపు కడపలో జాబ్ మేళా.. అర్హతలివే!

image

జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఆల్ డిక్సన్, కాంపోజిట్ టెక్నాలజీ, ట్రయోవిజన్ కంపెనీల్లో వివిధ హోదాలలో పనిచేయుటకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు అర్హులని తెలిపారు. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని తెలిపారు.

Similar News

News October 8, 2024

మైదుకూరు: కాలువలో పడి బాలుడి మృతి

image

మైదుకూరు మండలం విశ్వనాథపురంలో కొట్టం సుజిత్ (14) అనే బాలుడు కాలవలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన సుజిత్ గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News October 8, 2024

కడప: ఆన్ లైన్ గేమ్.. యువకుడి ఆత్మహత్య

image

కడప జిల్లాలో ఆన్‌‌లైన్ గేమ్‌లో నగదు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బంధువుల వివరాల ప్రకారం.. చక్రాయపేట మండలం బీ‌ఎన్ తాండాకు చెందిన కార్తీక్ నాయక్ గత కొంత కాలంగా అన్ లైన్ గేమ్ ద్వారా రూ.3 లక్షలు పొగుట్టుకున్నాడు. 2 రోజుల క్రితం కాలేటి వాగులో ఒక చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఇవాళ స్థానికులు గమనించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

News October 8, 2024

‘వైఎస్సార్ జిల్లా పేరును మార్చడం తగదు’

image

వైఎస్సార్ జిల్లా పేరును కడప జిల్లాగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని వైసీపీ జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆ సేవలకు గుర్తింపుగానే ఆయన పేరు పెట్టారన్నారు. కడప జిల్లాగా పేరు మార్చాలని పక్క జిల్లాకు చెందిన మంత్రి సీఎంకు లేఖ రాయడం హేయమైన చర్య అన్నారు.