News September 26, 2024
రేపు కనిగిరిలో ‘మెగా జాబ్ మేళా’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 14, 2024
ప్రకాశం జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా ప్రకాశం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఏవైనా సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టల్లోకి, సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 14, 2024
ప్రకాశం జిల్లాలో మద్యం లాటరీ ప్రక్రియ ప్రారంభం
ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో 2 కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ స్వయంగా లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం మొత్తం 3466 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో అధికారులు లాటరీ తీస్తున్నారు.
News October 14, 2024
ప్రకాశం: కారు బోల్తా.. ఇద్దరు మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. నలదలపూరులో జరిగిన వివాహానికి కొందరు హాజరయ్యారు. తిరిగి కారులో పోకూరుకు బయల్దేరారు. కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున కారు బోల్తాకొట్టింది. సామ్రాజ్యం(65), సులోచన(55) ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు, మిగిలిన వారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.