News December 15, 2024

రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

image

కరీంనగర్ జిల్లాలో రేపు ఆదివారం మంత్రి పొన్న ప్రభాకర్ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన షెడ్యూల్ ప్రకారం.. మధ్యాహ్నం 1:30 గంటలకు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం కురిక్యాల గ్రామంలో పిఎసిఎస్ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వేధిర గ్రామంలో నూతన పీఐసీఎస్ భవనం గోధాంలను ప్రారంభిస్తారు.

Similar News

News January 16, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ముస్తాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం. @ ఇబ్రహీంపట్నం మండలంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. @ వేములవాడలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్. @ బోయిన్పల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. @ మెట్పల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.

News January 15, 2025

KNR: కనుమ పండుగనే పశువుల పండుగ!

image

కనుమను రైతులు పశువుల పండుగగా వ్యవహరిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన పశుపక్షాదులనూ ఈరోజు పూజిస్తారు. ఎద్దులను, ఆవులను, గేదెలను వాగులు, చెరువుల వద్దకు తీసుకెళ్లి స్నానాలు చేయించి, ఈత  కొట్టిస్తారు. అనంతరం కొత్త పగ్గాలు, మెడలో మువ్వల పట్టీలు కట్టి, కొమ్ములకు రంగులు అద్ది పూజిస్తారు.

News January 15, 2025

అంబరాన్నంటిన కొత్తకొండ జాతర

image

ఉమ్మడి కరీంనగర్ జల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీరభద్రస్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల మండల ప్రజలు ఎడ్లబండ్ల రథాలతో కొత్తకొండకు వచ్చారు. వీరభద్రస్వామికి కోరమీసాలు, కోడెమొక్కులు, గుమ్మడికాయలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శరభ శరభ స్లోగన్స్‌తో మారుమోగింది.