News December 19, 2024
రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన

నైరుతి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కొనసాగుతుందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News December 23, 2025
కర్నూలు: శరీరం నుజ్జునుజ్జు

ఆదోని మండలం ఆరేకల్లు మెడికల్ కాలేజీ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన ఖాజా అనే వ్యక్తి మృతి చెందాడు. మృతదేహంపై భారీ వాహనాలు వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. మృతుడికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
News December 23, 2025
కర్నూలు: 633 మందికి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

శిక్షణే ఒక పోలీసు భవిష్యత్కు పునాదని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవే నిజమైన పోలీసు శక్తి” అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సోమవారం అన్నారు. కర్నూల్ APSP రెండవ బెటాలియన్ శిక్షణా కేంద్రం, DTC కర్నూలులో 633 మంది స్టైపిండరీ కానిస్టేబుళ్లకు 9నెలల ప్రాథమిక శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శిక్షణా కాలంలో ప్రతి రిక్రూట్ బాధ్యతాయుతమైన, ప్రజాభిముఖ పోలీసుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు.