News January 26, 2025
రేపు కలెక్టరేట్లో ప్రజావాణి: భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ప్రజావాణికి హాజరయ్యే ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News February 13, 2025
మంగళగిరి: 35 మంది కార్యకర్తలకు ముందస్తు బెయిల్

2021లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పలు ప్రాంతాలకు చెందిన 35 మంది వైసీపీ కార్యకర్తలపై గుంటూరు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి వైవీఎస్బీజీ పార్థసారథి దాడి కేసులో 35 మంది వైసీపీ కార్యకర్తలకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ క్రమంలో నిందితుల తరపున వైసీపీ లీగల్ సెల్ వాదించారు.
News February 13, 2025
డోన్‌లో అద్భుత దృశ్యం

డోన్ పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ఆలయంపై మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నేడు సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు ఆలయానికి వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం కనిపించింది. స్థానికులు ఆసక్తిగా తిలకించి తన ఫోన్లలో బంధించారు.
News February 13, 2025
42 మంది నెల్లూరు కార్పొరేటర్లకు నోటీసులు

ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో 42 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. అయితే 42 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వారికి నోటీసులు జారీ చేశారు. జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన కరిముల్లాకు కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థికి 40 ఓట్లు వేయగా, ఇద్దరు ఓటింగుకు పాల్గొనలేదు.