News October 6, 2024

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలచే వినతి పత్రాలు తీసుకుంటామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News November 9, 2024

ఫుట్‌బాల్ ఇండియా జట్టుకు అనిల్ కుమార్ ఎంపిక

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫుట్‌బాల్ ఇండియా జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన అనిల్ కుమార్ ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పెద్దపప్పూరు మండలం కుమ్మెత సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. త్వరలో గోవాలో జరుగనున్న పోటీల్లో పాల్గొననున్నట్లు అనిల్ కుమార్ తెలిపారు.

News November 9, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు

image

రానున్న మూడు రోజులు పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు అనంతపురం సమీపంలోని రేకులకుంట వ్యవసాయ క్షేత్రం నుంచి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు నారాయణస్వామి, విజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 9, 2024

నేడు తరగతులు నిర్వహించరాదు: డీఈవో

image

శ్రీ సత్యసాయి జిల్లాలో నేడు రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించరాదని డీఈవో కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.