News February 9, 2025
రేపు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఈనెల 10వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా తమ సమస్యలపై అర్జీలు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News November 27, 2025
VZM: డిసెంబర్ 5న డ్రమ్స్ శివమణికి సత్కారం

ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో డిసెంబరు 5న విజయనగరంలో ఘంటసాల జయంత్యుత్సవాలు జరుగుతాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత డ్రమ్స్ శివమణిని ఆరోజు సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.భీష్మారావు తెలిపారు. ముందుగా గుమ్చీ కూడలిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో 12 గంటల స్వరాభిషేకం, సాయంత్రం శివమణి సంగీత కార్యక్రమం చేపట్టనున్నారు.
News November 27, 2025
WPL మెగా వేలంలో అమ్ముడుపోని హీలీ.. దీప్తికి రూ.3.2 కోట్లు

WPL మెగా వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీకి షాక్ తగిలింది. వేలంలో ఆమెను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడంతో Unsoldగా మిగిలారు. భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తిని రూ.3.2 కోట్లకు యూపీ వారియర్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సౌతాఫ్రికా కెప్టెన్ లారాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.10కోట్లకు దక్కించుకుంది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ కొనుగోలు చేసింది.
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.


