News February 9, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ

image

నంద్యాలలోని కలెక్టరేట్‌లో ఈనెల 10వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆయా శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు. ప్రజలు కూడా తమ సమస్యలపై అర్జీలు చేసుకోవచ్చని చెప్పారు.

Similar News

News February 13, 2026

కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కోసం లోకేశ్ ఆత్మీయ విందు

image

మంత్రి లోకేశ్ కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కుటుంబాల కోసం నిర్వహించిన ఆత్మీయ విందు రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిందని మంత్రి కొల్లు కొనియాడారు. నిరంతరం ప్రజాసేవలో తలమునకలయ్యే నాయకుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం లోకేశ్‌కే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విందు కార్యక్రమం కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచిందని, ఇలాంటి నాయకత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

News February 13, 2026

తిరుపతి: మొన్న రిమూవ్.. నిన్న రిలీవ్!

image

TTD ఎస్వీ వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్ వ్యవహారం మలుపులు తిరిగింది. రిజిస్ట్రార్ భాస్కరుడును ఈనెల 4న రిమూవ్ చేసినట్లు VC ఉత్తర్వులు ఇచ్చారు. వారం రోజులు అదే సీటులో ఉండగా 11న పదవి కాలం ముగియడంతో రిలీజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక రిమూవ్ చేసిన రోజు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఒక్కరికి ఇవ్వగా.. రిలీవ్ రోజు మరొకరికి ఇన్‌ఛార్జ్ ఇచ్చారు.

News February 13, 2026

ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.