News March 29, 2025
రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉగాది వేడుకలు

ఉగాది ఉత్సవాలను ఆదివారం ఉదయం గం.10.30ల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎపీహెచ్ఆర్డీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Similar News
News April 4, 2025
రైతులకు గుడ్‌న్యూస్.. యాసంగిలోనూ బోనస్

TG: ప్రస్తుత యాసంగిలోనూ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మాట్లాడారు. గత వానాకాలం సీజన్లో క్వింటాకు రూ.500 చొప్పున మొత్తం రూ.1700 కోట్ల బోనస్ అందజేశామన్నారు. దేశంలో రైతులకు బోనస్ ఇస్తున్న తొలి ప్రభుత్వం తమదేనన్నారు. వరి దిగుబడిలో ఏపీని తెలంగాణ అధిగమించిందని పేర్కొన్నారు.
News April 4, 2025
WNP: ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం దరఖాస్తులు

ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఏప్రిల్ 10వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారిగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్(క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్),ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు పదో తరగతి, అగ్నివీర్ ట్రేడ్‌మెన్ ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారు అర్హులన్నారు.
News April 4, 2025
కంచరపాలెంలో వివాహిత ఆత్మహత్య

విశాఖలో వివాహిత దేవి గురువారం ఆత్మహత్య చేసుకుంది. చీకటి దేవి(30)కి 8 ఏళ్ల క్రితం విడాకులు తీసుకొని ముగ్గురు పిల్లలతో కంచరపాలెంలో తన తల్లి దగ్గరే ఉండేది. ఏడాది క్రితం కలహాల కారణంగా పిల్లలను తల్లి దగ్గరే వదిలి తను వేరేగా ఉంటోంది. ఆ ప్రాంతంలోనే ఓ షాపులో పనిచేస్తూ దేవి రసాయనాలు తాగి స్పృహ కోల్పోయింది. కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.