News December 27, 2024

రేపు కాకినాడకు రానున్న సినీ నటులు

image

ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేశ్ శనివారం కాకినాడలో ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఉత్సవంలో పాల్గొననున్నారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ్‌తోపాటు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, ఆమని, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి పాల్గొననున్నారు. సినీ నటుల రాక కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 29, 2024

విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో ఈదుతూ..

image

విశాఖ నుంచి కాకినాడ వరకు సముద్రంలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఈదుతూ ప్రయాణించే సాహస యాత్రను సామర్లకోటకు చెందిన శ్యామల గోలి అనే మహిళ ప్రారంభించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, గండి బాబ్జి పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాహస యాత్ర ఆమె ఆత్మవిశ్వాసానికి, మహిళల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఒక్క రోజులో దాదాపు 30 కిలోమీటర్లు ఈదుతూ 5 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో శ్యామల ప్రణాళిక రూపొందించారు.

News December 29, 2024

సంక్రాంతి పండుగ.. హోటల్స్‌కు ఫుల్ డిమాండ్

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని హోటల్స్, లాడ్జిలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇక్కడి ఉత్సవాలు, కోడిపందేలను తిలకించేందుకు రాష్ట్రాంలోని పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున వస్తుంటారు. దీంతో రూమ్‌ల అద్దెలు కొండెక్కాయి. మండపేట, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, రాజోలు తదితర ప్రాంతాల్లో 4 రోజులకు రూ.వేలల్లో అద్దెలున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లతో హోటల్స్ బుక్ అయిపోయాయి.

News December 29, 2024

వాటిపై 31వరకు అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్ ప్రశాంతి

image

షెడ్యూల్డ్ కులాల సర్వే జాబితా ప్రచురణ నిమిత్తం డిసెంబర్ 26న సర్వే ప్రారంభమైందని, ఈ జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి ఈ నెల 31 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తున్నామని కలెక్టర్ ప్రశాంతి శనివారం తెలిపారు. ఫిర్యాదులను VROలు సేకరించి పోర్టల్‌లో డిజిటలైజ్ చేస్తారని, తహశీల్దార్ ద్వారా తుది సమీక్ష పూర్తి చేసి 2025 జనవరి 1న తుది జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు.