News March 9, 2025
రేపు కాకినాడలో పీజీఆర్ఎస్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జిల్లా స్థాయిలో ఈ నెల 10న కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
Similar News
News March 17, 2026
సంగారెడ్డి: పిల్లలను ఈతకు పంపవద్దు: ఎస్పీ

ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలను ఈతకు పంపవద్దని ఎస్పీ పారితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చెరువులు కుంటల వద్ద పిల్లలకు లోతు తెలియకపోవడంతో మునిగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని సూచించారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
News March 17, 2026
ఆసిఫాబాద్: ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం!

ఎస్సీ యువతీ యువకులకు 2025–26 వార్షిక ప్రణాళిక కింద స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని, యూనిట్ ఖర్చు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హులు మార్చి 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News March 17, 2026
ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలి: కలెక్టర్

బాపట్లలో సోమవారం నిర్వహించిన వీక్షణ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఎంజిఎన్ఆర్ఈజీఎస్, గృహ నిర్మాణ శాఖ పనుల పురోగతిని సమీక్షించారు. పనుల్లో వెనుకబడిన మండల అధికారులను ప్రశ్నిస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎంఏవై పథకంలోని ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు.


