News March 28, 2025

రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శనివారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4:40 నిమిషాలకు కొడంగల్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొననున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

Similar News

News April 23, 2025

SKLM: గ్రామదేవతల సిరిమాను ఉత్సవంపై సమీక్ష

image

అన్ని శాఖల సమన్వయంతో శ్రీ గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. బుధవారం కలెక్టరెట్ మందిరంలో గ్రామదేవతల సిరిమాను ఉత్సవం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సమన్వయంతో విధులు నిర్వహించి పండగ ఒక మంచి వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 

News April 23, 2025

విజయవాడ జైలుకు PSR.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

image

AP: ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబై నటి జెత్వానీపై కేసు నమోదు చేయాలని ఆయన IPSలు కాంతిరాణా, విశాల్ గున్నీలకు చెప్పినట్లు తేలింది. మహిళపై అక్రమ కేసు నమోదుకు అధికారులను ప్రభావితం చేశారని పోలీసులు వెల్లడించారు. PSR ఆదేశాలతో పోలీసులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ ఆధారాలు సృష్టించినట్లు రిపోర్టు వెల్లడించింది. అటు PSRను విజయవాడ జైలుకు తరలించారు.

News April 23, 2025

నర్సాపురం హైస్కూల్‌ను సందర్శించిన కలెక్టర్

image

దుమ్ముగూడెం మండలం నరసాపురం పాఠశాలలను జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ బుధవారం సందర్శించారు. పాఠశాల ఆవరణంలోని వంట షెడ్డును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు పంపిణీ చేసిన సైకిళ్లకు పంచర్ కిట్లను సరఫరా చేస్తానని అన్నారు. పాఠశాలలో మంచినీటి సౌకర్యం కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

error: Content is protected !!