News May 3, 2024
రేపు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 4న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం హెలీప్యాడ్ స్థలాన్ని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి, ఇతర అధికారులు పరిశీలించారు. ముందుగా మండల పరిషత్ సమీపంలో హెలికాప్టర్ దిగే అవకాశాలను పరిశీలించారు. అనంతరం సంకిరెడ్డిపల్లి గుంపుగట్టు వద్ద పరిశీలించి ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News November 4, 2024
MBNR: సిలబస్ పూర్తి కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సిలబస్ పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కళాశాలల్లో అతిథి అధ్యాపకులను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కళాశాలలకు సిబ్బందిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో వార్షిక పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కాక విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు.
News November 4, 2024
MBNR: మూడేళ్ల బాలికపై హత్యాచారయత్నం
మూడేళ్ల బాలికపై ఓవ్యక్తి హత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన MBNRలో జరిగింది. రూరల్ CI గాంధీనాయక్ కథనం.. MBNRలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఓ దుకాణ నిర్వహకుడి కూతురు(3) ఆదివారం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటుంది. అక్కడే ఓ హోటల్‌లో పనిచేసి వ్యక్తి బాలికను పక్కకు తీసుకువెళ్లి గొంత నులిమి, దుస్తులు విప్పేందుకు యత్నించాడు. స్థానికులు, తల్లిదండ్రులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
News November 4, 2024
పాలమూరు జిల్లాలో మీ సేవలు బంద్..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం మీ సేవ కేంద్రాలు స్వచ్ఛందంగా బంద్ చేపట్టినట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. మీ సేవలు ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కళా భవన్‌లో 14వ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. జిల్లాలోని మీ సేవ నిర్వాహకులందరూ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ఈ రోజు బంద్ ప్రకటించారు. మంగళవారం యథావిధిగా కార్యాలయాలు కొనసాగుతాయన్నారు.