News February 25, 2025
రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News January 11, 2026
ఉమ్మడి ఆదిలాబాద్‌పై గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్

HYDలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉమ్మడి జిల్లా నేతలతో కలిసి ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.
News January 11, 2026
గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల

AP: ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3000 TMCల గోదావరి నీటిలో 200 TMCలను వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు APకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు. నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు SCలో విచారణ నేపథ్యంలో అధికారులు, లాయర్లతో VC నిర్వహించారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు.
News January 11, 2026
అన్నమయ్య జిల్లాలో రేపు అర్జీల స్వీకరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) ద్వారా సోమవారం ప్రజల నుంచి అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్‌లో నమోదు చేసుకోవచ్చని డీపీఆర్‌ఓ తెలిపారు. అవసరం అయితే మీకోసం కాల్ సెంటర్ 1100ను సంప్రదించగలరన్నారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓలు సమస్యలను స్వీకరిస్తారని అన్నారు.


