News February 25, 2025
రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News February 25, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలు.. 200 మంది పోలీస్ ఫోర్స్: ములుగు SP

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల వద్ద 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, బూత్ వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని సూచించారు.
News February 25, 2025
Nifty Worst Record: 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 నెలలు నష్టాలే..

నిఫ్టీ50 ఇన్వెస్టర్లు కోరుకోని రికార్డును నమోదు చేసింది. సూచీ ఆరంభం నుంచి 30 ఏళ్లలో రెండోసారి వరుసగా 5 అంతకన్నా ఎక్కువ నెలలు పతనమైంది. 2024 OCT – 2025 FEB మధ్య 5 నెలలు దిగజారింది. 12.6% నష్టపోయింది. ఇది ఇంకా కొనసాగే అవకాశముంది. 1994 SEP – 1995 APR మధ్యన నిఫ్టీ ఏకంగా 8 నెలలు కుంగింది. 31.4% పతనమైంది. ఇక 1996 JUL – NOV మధ్య 5 నెలల్లో 26% తగ్గింది. 1990, 1998, 2001లో వరుసగా 4 నెలలు నష్టపోయింది.
News February 25, 2025
వారానికి 48గంటల పని చాలు: అశ్విన్ యార్ది

‘క్యాప్‌జెమినీ’ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగి రోజుకు 9.30గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేస్తే సరిపోతుందని తెలిపారు. అంతేకాకుండా వారాంతాల్లో ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని వారికి మెయిల్స్ పంపడానికి తాను వ్యతిరేకమని అన్నారు. అయితే గతంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.