News February 7, 2025
రేపు కోదాడలో నవోదయ ప్రవేశ పరీక్ష..

నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల మిగులు సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షను శనివారం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ సీసీ రెడ్డి పాఠశాలల్లో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు 10 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Similar News
News March 18, 2025
SHOCKING.. మోమోస్ తయారీ కేంద్రంలో కుక్క మాంసం!

పంజాబ్‌లో మటౌర్‌లోని ఓ ఫ్యాక్టరీలో కుక్క మాంసం కలకలం రేపింది. మోమోస్, స్ప్రింగ్ రోల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో అధికారులు తనిఖీలు చేయగా ఫ్రిడ్జిలో కుక్క తల కనిపించింది. దీంతో పాటు కొంత మాంసాన్ని గుర్తించారు. ఆ తలను టెస్టుల కోసం పంపించారు. కాగా ఈ ఫ్యాక్టరీ నుంచి చాలా చోట్లకు మోమోస్, స్ప్రింగ్ రోల్స్ పంపిస్తారని సమాచారం. మోమోస్ తయారీలో కుక్క మాంసాన్ని ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.
News March 18, 2025
WGL: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా అపర్ణ

వరంగల్ అబ్బనికుంట ప్రాంతానికి చెందిన రాసం అపర్ణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పరీక్షల్లో జోన్- 4లో 38వ ర్యాంక్, మహిళా విభాగంలో 7వ ర్యాంక్ సాధించారు. తన భర్త సంతోష్, కుటుంబసభ్యుల సహకారంతో ఎలాంటి కోచింగ్ లేకుండానే ఉద్యోగం సాధించానని అపర్ణ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.
News March 18, 2025
‘X’ వేదికగా రామ్మూర్తి నాయుడుకు సీఎం నివాళులు

‘X’ వేదికగా సోదరుడు రామ్మూర్తి నాయుడుకు సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఘన నివాళులు అర్పించారు. తన కుటుంబంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో రామ్మూర్తి నాయుడుకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయని తెలిపారు. ఆయన స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నట్లు చెప్పారు.