News October 31, 2024

రేపు గోపాలపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం రాక

image

గోపాలపురం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు ద్వారకతిరుమల మండలం, జగన్నాథపురానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దీపం పథకం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News November 17, 2025

నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ

image

ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నేడు కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వాటి ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి Meekosam. ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చాన్నారు.

News November 16, 2025

ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

image

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

News November 16, 2025

పెదఅమీరం: తొలి జీతం.. గ్రామదేవతకు అందజేత

image

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ దేవాలయ అభివృద్ధికి ఉపాధ్యాయుడు బూరాడ వెంకటకృష్ణ శనివారం తన మొదటి జీతాన్ని అందజేశారు. మెగాడీఎస్సీ 2025 లో స్కూల్ అసిస్టెంట్(మాథ్స్) ఉద్యోగం సాధించిన వెంకటకృష్ణ తన తొలి జీతం మొత్తం రూ.50,099 లను ఆలయ అభివృద్ధి కమిటీ పెద్ద కోరా రామ్మూర్తికి అందజేశారు. ఆయనను పలువురు అభినందించారు.