News February 2, 2025

రేపు గ్రివెన్స్‌ డేను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పీజీఆర్ఎస్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు ఉదయం 9:30 గంటలకే పీజీఆర్ఎస్‌కు హాజరు కావాలని ఆదేశించారు.

Similar News

News March 14, 2025

కడప: ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు.. ఎస్టీలకు రూ.75 వేలు

image

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో అసంపూర్ణంగా ఉన్న గృహాలకు ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేల చొప్పున సుమారు 25 వేల మందికి ఆర్థిక సాయం విడుదల చేస్తామన్నారు. ఈనెల 15నుంచి 23వ తేదీ వరకు సంబంధిత అధికారులు నిర్మాణాల వద్దకు వచ్చి చిత్రాలు తీసి అప్లోడ్ చేస్తారని స్పష్టంచేశారు.

News March 14, 2025

నేడు గ్రూప్-3 ఫలితాలు

image

TG: నేడు గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు 2,69,483 మంది హాజరయ్యారు. దాదాపు 49.76 శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, 2 ఫలితాలను TGPSC ప్రకటించింది.

News March 14, 2025

నల్గొండ: ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల వంటా వార్పు

image

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటీయూ జిల్లా నాయకులు అవుటు రవీందర్ తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న మెమోరాండం నల్గొండ జిల్లా కార్యాలయంలో సమర్పించారు.

error: Content is protected !!