News August 13, 2024
రేపు చందూర్ మండలం బంద్
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చందూర్ మండల కేంద్రంలో బుధవారం స్వచ్ఛందంగా బందును ప్రకటించుకున్నారు. హిందువులపై దాడులు ఆగే వరకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపడతామని గ్రామస్థులు పిలుపునిచ్చారు. సాయంత్రం కొవ్వత్తులతో యువత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News September 14, 2024
దోమకొండ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
రోడ్డు ప్రమాదం ఇద్దరి స్నేహితుల కుటుంబాలలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన జొన్నల రాము(23), ముత్తి రమేశ్(24))లు రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న వినాయకుడి పూజా సామగ్రి కోసం బైక్‌పై కామారెడ్డికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉగ్రవాయి స్టేజి వద్ద వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొట్టింది.
News September 14, 2024
కామారెడ్డి: ముమ్మరంగా గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పట్టణంలోని శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ సమీపంలో గల శాఖరి కుంటలో కార్యదర్శి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు సులువుగా వెళ్లేందుకు రహదారిని చదును చేసి, విద్యుత్ దీపాలను అమర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయితీ కార్యనిర్వహణ అధికారి మహేశ్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
News September 14, 2024
నేడు బాధ్యతలు స్వీకరించనున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడిగా నియమితులైన విషయం తెలిసిందే. కాగా, నేడు ఆయన నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని హార్టీకల్చర్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉమ్మడి NZB మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు.