News March 15, 2025
రేపు జనగామ జిల్లాకు సీఎం రాక

జనగామ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లిలో సభకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News February 12, 2026
బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
News February 12, 2026
సేంద్రియ సాగుతోనే ‘డబుల్ ధమాకా’: కలెక్టర్

సేంద్రియ సాగుతోనే రైతులకు రెట్టింపు లాభాలు చేకూరుతాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. గురువారం రెడ్డిగూడెం మండలం రంగాపురంలో ఆర్డీఓ మాధురితో కలిసి ఆయన మామిడి తోటలను సందర్శించారు. క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులను పరిశీలించి, స్వయంగా మామిడి కాయలకు ఫ్రూట్ కవర్లు కట్టారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPO) ప్రతినిధులతో మాట్లాడి, నాణ్యమైన దిగుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.
News February 12, 2026
కూరగాయ పంటల్లో తెగుళ్లు- కట్టడి సూచనలు

☛ అన్ని కూరగాయ పంటల్లో అక్షింతల పురుగు, చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 2మి.లీ కలిపి పిచికారీ చేయాలి. వంగ, కాకర, ఆగాకర పంటలకు మాత్రం లీటరు నీటికి థయోడికార్బ్ 1 గ్రాము కలిపి పిచికారీ చేసుకోవాలి.
☛ మిరప, టమాటా, క్యాబేజీ వంటి పంటల్లో ఎండుతెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2గ్రా. కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.


