News March 15, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు: ఆంజనేయులు

రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలను కోరారు.
Similar News
News February 7, 2026
మెదక్: ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల లెక్కింపు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో పోస్టల్ బ్యాలెట్, లెక్కింపు విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతుందన్నారు.
News February 7, 2026
మెదక్: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

2026–28 కాలానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్న నేపథ్యంలో అర్హత గల జర్నలిస్టులు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
News February 7, 2026
మెదక్: మున్సిపల్ బరిలో న్యాయవాది

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో యువ న్యాయవాది జీవన్ రావు పోటీ చేస్తున్నారు. 2016లో లా పట్టా అందుకున్న జీవన్ రావు ప్రస్తుతం మెదక్ కోర్టులో ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 7వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రావు సతీమణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి 6వ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.


