News May 4, 2024
రేపు టీడీపీలో చేరనున్న సినీ నిర్మాత ప్రవీణ్ కుమార్ రెడ్డి
ప్రముఖ సినీ నిర్మాత, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన మిత్ర బృందం ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన శనివారం నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డితో ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను చర్చించారు.
Similar News
News November 11, 2024
వెంకటంపేట చెరువులో యువకుడు అనుమానాస్పద మృతి
దుత్తలూరు మండలం వెంకటంపేట చెరువులో యువకుడు అనుమానస్పదంగా మృతి చెందారు. మృతదేహం చెరువు తూము దగ్గర తేలి ఆడడంతో స్థానికులు గమనించారు. మృతి చెందిన యువకుడు వెంకటంపేట గ్రామానికి చెందిన పందిర్ల గురు చరణ్ (17) గా గుర్తించారు. ఆదివారం నుంచి ఆ యువకుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. చెరువులో ఆ యువకుడు మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.
News November 11, 2024
నెల్లూరు జైలుకు రూ.200 కోట్లకు పైగా దోచేసిన పాత RDO
మదనపల్లె పూర్వ RDO MS మురళి భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు మురళి కూడబెట్టిన ఆస్తులపై శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. కిలో బంగారు ఆభరణాలు, 800 గ్రా. వెండి, ఏడు ఇళ్లు, ఒక హోటల్, 12 స్థలాలు, 20 బ్యాంకు ఖాతాలు, 8 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.230 కోట్ల పైగా ఉంటుందని అంచనా. ఆయనను ఆదివారం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.
News November 11, 2024
నెల్లూరు: వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నం
ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. నెల్లూరు రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జాన్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడడంతో ఈ నెల 7వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.