News July 31, 2024
రేపు టెక్కలికి అచ్చెన్న రాక

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం ఉదయం టెక్కలి మండల కేంద్రంలోని కండ్రవీధిలో పర్యటించనున్నారు. లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తారు. అనంతరం 10.30 గంటలకు టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో అభివృద్ధి సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొంటారని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లా నుంచి నియామక పత్రాలు ఎంతమంది అందుకున్నారంటే.!

శ్రీకాకుళం జిల్లా నుంచి కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను CM చంద్రబాబు నేడు మంగళగిరిలో అందించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం 373 మంది ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో..
☛ సివిల్ కానిస్టేబుల్స్ మెన్-129
☛ కానిస్టేబుల్ ఉమెన్- 20
☛ APSP- 224 మంది ఉన్నట్లు స్పష్టం చేశారు.
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.
News December 16, 2025
శ్రీకాకుళం: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.


