News January 27, 2025
రేపు డయల్ యువర్ వనపర్తి డీఎం ప్రోగ్రాం

వనపర్తి డిపోలో రేపు డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వి. వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రజల నుంచి సూచనలు సలహాలు ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని తెలిపారు.7382826289 కు ఫోన్ చేసి సూచనలు ఇవ్వాలని కోరారు.
Similar News
News January 9, 2026
‘క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్’.. లాలూ ఫ్యామిలీపై ఢిల్లీ కోర్టు!

‘Land for jobs scam’ కేసులో RJD చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. CBI ఛార్జ్‌షీట్ ప్రకారం.. లాలూ ఫ్యామిలీ ఒక ‘క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్’లా పనిచేసిందని న్యాయమూర్తి అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు రాయించుకున్నారు అనడానికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు. లాలూతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం 46 మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించారు.
News January 9, 2026
మిస్సయిన ఫోన్‌ను నిమిషాల్లో గుర్తించారు!

సాధారణంగా ఫోన్ పోయిందంటే దొరకడం గగనమే అని ఆశలు వదులుకుంటాం. కానీ పోయిన ఫోన్‌ను క్షణాల్లో చేతిలో పెట్టి ఔరా అనిపించారు బెంగళూరు పోలీసులు. ఓ కాలేజీ విద్యార్థిని తన ఫోన్ పోయిందని ‘112’కు ఫిర్యాదు చేశారు. కేవలం 8 నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్న పోలీసులు GPS సాయంతో ఫోన్‌ను రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. అందుకే ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.
News January 9, 2026
VZM: ‘పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగుపడాలి’

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మెరుగుపరిచి ఓపిని పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్య సేవలపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫరెన్స్‌తో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ సర్వేపైనా చర్చించారు. పీహెచ్‌సీల వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాలని ఆదేశించారు.


