News August 30, 2024
రేపు డయల్ యువర్ DM కార్యక్రమం: RM KMM
ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని డిపోల పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ DM కార్యక్రమం రేపు నిర్వహించాల్సిందిగా రీజినల్ మేనేజర్ సరిరామ్ ఆదేశించారు. రేపు సాయింత్రం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక డిపో మేనేజర్లకు కాల్ చేసి సమస్యలను దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు…
ఖమ్మం: 9959225958
మధిర: 9959225961
సత్తుపల్లి: 9959225962
భద్రాచలం: 9959225960
కొత్తగూడెం: 9959225959
మణుగూరు: 9959225963
Similar News
News September 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేశుని నిమజ్జనాలు
> నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
> నేడు సత్తుపల్లి మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
> నేడు అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
> నేడు కారేపల్లిలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
News September 17, 2024
గత ప్రభుత్వం ఇచ్చింది 49 వేలు కార్డులు మాత్రమే: పొంగులేటి
ఖమ్మం: గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేస్తుందని చెప్పారు. దాదాపు 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయని, వాటిని బైఫరికేషన్ చేసి, స్మార్ట్ కార్డులు ఇస్తామని, ప్రతీ పేదవాడికి కార్డులు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
News September 17, 2024
2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం: భట్టి
2035 నాటికి తెలంగాణ రాష్ట్రం 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు.