News February 26, 2026
రేపు తిరుపతికి రానున్న ‘డెకాయిట్’ టీం

ఏర్పేడులోని IIT తిరుపతిలో శుక్రవారం నుంచి తిరుత్సవ్-2026 టెక్నో ఈవెంట్ ప్రారంభం కానుంది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా డెకాయిట్ సినిమా హీరో అడివి శేష్, హీరోయిన్ మృనాల్ ఠాకూర్ హాజరుకానున్నారు. ఇక్కడే ‘డెకాయిట్’ తొలి పాటను విడుదల చేయనున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను వెలికాతీయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
Similar News
News April 20, 2026
వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్‌కు ఏర్పాట్లు

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్‌కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.
News April 20, 2026
HYD: పిల్లలు కలగటం లేదా? ఇక్కడికి రండి

పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగక దిగులు చెందుతున్నారా? ఆ చింతన వదిలేయండి. నమ్మకంతో HYD గాంధీ ఆస్పత్రిలో IVF(సంతాన సాఫల్య కేంద్రానికి) రావాలని డా.ఇందిరా సూచిస్తున్నారు. అద్భుతమైన చికిత్స అందిస్తున్నామని, IVF సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారుగా 40 శాంపిల్స్ సేకరించి, 17 మందికి IVF వైద్యం ప్రారంభించినట్లుగా ఆమె తెలిపారు. వీరిలో ఏడుగురికి పాజిటివ్ ఫలితం వచ్చిందన్నారు.
#SHARE IT
News April 20, 2026
పల్నాడు: అసభ్య ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

నాదెండ్ల (M) గణపవరంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేసే ఒడిశాకి చెందిన ప్రసాద్‌దాస్ పంతులు అనే కార్మికుడు ఓ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తోటి కార్మికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన నిందితుడిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించి, పోక్సో కేసు నమోదు చేశారు.


