News April 13, 2024
రేపు తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటన

తెనాలి నియోజకవర్గంలో ఆదివారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పవన్ కళ్యాణ్ తెనాలి వస్తారని చెప్పారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని కోరారు. గతంలో అనారోగ్యం వలన పవన్ తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
Similar News
News April 20, 2025
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : DEO

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.
News April 20, 2025
ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్: డీఈఓ

నల్లచెరువు అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను డీఈఓ సీవీ రేణుక సస్పెండ్ చేశారు. హాజరు తప్పుగా చూపడం, మధ్యాహ్న భోజన లబ్దిదారుల సంఖ్యను పెంచడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై జాకీర్ హుస్సేన్, డి. రవిపై చర్యలు తీసుకున్నారు. డీఈఓ తనిఖీలో 46 మందికి హాజరు వేసినా, కేవలం 9 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.
News April 20, 2025
అమరావతి ప్రధాని పర్యటనకు స్పెషల్ అధికారుల నియామకం

ప్రధాని పర్యటనలో విధులు నిర్వహించేందుకు 31 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వంఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని పర్యటన విజయవంతం చేసే బాధ్యత వారిదే . రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా జి.వీరపాండియన్ ఉన్నారు. పీఎంవో, ఎస్పీజీ, సీఎంవోలతో సమన్వయం చేసుకోటానికి శాంతిభద్రతల అదనపు డీజీ మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ప్రధాని రోడ్, బహిరంగ సభ, వీఐపీల బాధ్యతలు అప్పగిస్తూ ఆయనకు ఆదేశాలిచ్చారు.