News July 12, 2024
రేపు తోటపల్లి పాత ఆయకట్టు నీటి విడుదల

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 64 వేల ఎకరాల పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈనెల 13న సాగునీరు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ ఏఈ రాజేశ్ శుక్రవారం తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వీరఘట్టం, పాలకొండ, బూర్జ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వంగర మండలాలకు సాగునీటిని ప్రణాళికాబద్ధంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Similar News
News October 15, 2025
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కీలక సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మందాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News October 15, 2025
SKLM: అధికారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనలు

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News October 14, 2025
ఎచ్చెర్ల: క్యాంటీన్ నిర్వహణకు వర్శిటీ దరఖాస్తుల ఆహ్వానం

ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఉన్న క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తిగల వారి నుంచి సంబంధిత దరఖాస్తులను వర్శిటీ ఆహ్వానిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారమ్ వంటివి వర్శిటీ www.brau.edu.inలో అందుబాటులో ఉంటాయన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి అందజేయాలన్నారు.