News September 29, 2024

రేపు నందికొట్కూరులో జాబ్ మేళా

image

నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ సునీత తెలిపారు. 10వ తరగతి, ఆపై చదివిన నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు tinyurl.com/jobmelagdcndk లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

Similar News

News October 11, 2024

కర్నూలు: బైక్ ప్రమాదంలో యువకుడి మృతి

image

కర్నూలు జిల్లాలో బైక్ అదుపుతప్పి యువకుడు మృతిచెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కోసిగి గ్రామానికి చెందిన తిమ్మయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు ఆంజనేయులు(17) సిద్ధరుఢా మఠం దగ్గర నివాసం ఉంటున్నారు. గురువారం సాయంకాలం ఉరుకుందు రోడ్డు సమీపంలో ద్విచక్ర వాహనంపై బహిర్భూమికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి గాయపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 11, 2024

నంద్యాలలో మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ

image

నంద్యాల జిల్లాలో 105 మద్యం షాపులకు 1,627 మంది టెండర్ దాఖలు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. నంద్యాల పరిధిలో 24 షాపులకు 584 టెండర్లు దాఖలయ్యాయని చెప్పారు. ఆళ్లగడ్డ 19 షాపులకు 262, డోన్ 16 షాపులకు 251, ఆత్మకూరు 13 షాపులకు 164, నందికొట్కూరు 10 షాపులకు 164, బనగానపల్లె 12 షాపులకు 160, కోవెలకుంట 11 షాపులకు 110 టెండర్లు వచ్చాయన్నారు.

News October 11, 2024

ఈనెల 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్‌లో ఈనెల 14న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పల్లె పండుగ వారోత్సవాలతో పాటు మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ ఉండటంతో రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు గమనించాలని కోరారు. జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు.