News March 30, 2024
రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన పంటలను పరశీలించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి , హాలియా ప్రాంతాల్లో పర్యటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Similar News
News February 9, 2026
నల్గొండ: ఎన్నికల పోలింగ్ సిబ్బంది కేటాయింపు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ పూర్తయింది. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నల్గొండ కార్పొరేషన్ సహా మిర్యాలగూడ, చండూరు వంటి మున్సిపాలిటీల్లోని 475 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 2,855 మంది సిబ్బందిని (20% రిజర్వ్‌తో కలిపి) కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
News February 9, 2026
ఎన్నికలకు సిద్ధం.. సిబ్బంది ఖరారు: కలెక్టర్

జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలకమైన చివరి విడత ర్యాండమైజేషన్ సోమవారం కలెక్టరేట్‌లో పూర్తయింది. ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేష్ సమక్షంలో కలెక్టర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. NLG కార్పొరేషన్ సహా MLG, నందికొండ, హలియా, DVK, చండూరు, చిట్యాల పురపాలక సంఘాల్లో 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News February 9, 2026
మర్రిగూడ: అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

మర్రిగూడ మండలం సరంపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీలోని విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ నక్క రాములమ్మ, కార్యదర్శి రాకేష్, సిడిపిఓ సక్కుబాయి పాల్గొన్నారు.


