News January 29, 2025
రేపు నాగోబా జాతర వద్ద ప్రత్యేక కార్యక్రమాలు: కలెక్టర్

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర వద్ద ఈనెల 30న గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం సాయంత్రం 6.00 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ప్రజలందరూ హాజరై తిలకించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Similar News
News February 19, 2025
CS వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆదిలాబాద్ కలెక్టర్

వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించగా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో తాగు నీటి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2025
ఆదిలాబాద్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

◼️ రుయ్యాడిలో బావను చంపిన బామ్మర్ది◼️గుడిహత్నూర్‌లో గంజాయి అమ్ముతున్న ఇద్దరి అరెస్ట్◼️సీఎంని కలిసిన డీసీసీబీ ఛైర్మన్ భోజారెడ్డి◼️బేల, మావల 3 చొప్పున ట్రాక్టర్లు సీజ్◼️నార్నూర్ వైన్స్‌లో చోరీ◼️విద్యుత్తు, నీటి సమస్య లేకుండా చర్యలు: ADB కలెక్టర్
News February 18, 2025
ADB: కత్తిపోట్ల ఘటన.. UPDATE

తలమడుగు మండలం రుయ్యాడిలో ఓ వ్యక్తి <<15500882>>దారుణ హత్య<<>>కు గురయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో బావబామ్మర్దుల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో బావ మహేందర్‌పై బామ్మర్ది అశోక్ కత్తితో దాడి చేశాడు. దీంతో మహేందర్ అక్కడికక్కడే మరణించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.