News April 21, 2024
రేపు నామినేషన్ వేయనున్న బీబీ పాటిల్

జహీరాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున రేపు బీబీ పాటిల్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పాటిల్ కోరారు. ఉదయం 8 గంటలకు రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో పూజలు జరిపి ఉదయం 11 గంటలకు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత పట్టణంలోని PSR గార్డెన్‌లో కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు.
Similar News
News March 12, 2025
మెదక్: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికీ ప్రమాదముంది. సంగారెడ్డిలో గాలినాణ్యత విలువ 124గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ‘అధ్యక్షా.. మెదక్ జిల్లాపై దృష్టి పెట్టండి’

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మెదక్ జిల్లాలో అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా మంబోజిపల్లి చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలి. వనదుర్గ ప్రాజెక్ట్ ఎత్తు పెంపు, కాలువల సిమెంట్ లైనింగ్ పూర్తితో పాటు కాళేశ్వరం కాలువలు పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన రామాయంపేట రెవెన్యూ డివిజన్‌లో అధికారిక కార్యక్రమాలు కొనసాగేలా చూడాలి.
News March 12, 2025
మెదక్ జిల్లాలో పోలీస్ హోంగార్డు మృతి

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డ్ తలారి మహేందర్(39) మంగళవారం రాత్రి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.