News October 18, 2024
రేపు నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళ

నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం రేపు ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి బి.పి మధుసూదన్ రావు తెలిపారు. ఉద్యోగ మేళాలో క్యాషియర్, ప్యాకెర్స్, సేల్స్ అసోసియేట్స్, పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలకు అవకాశం ఉందని అన్నారు. జిల్లా కలెక్టరెట్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్ పాసై 18 నుంచి 26 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు అర్హులన్నారు.
Similar News
News November 27, 2025
NZB: జిల్లాలో తొలి రోజు నామినేషన్లు ఎన్ని అంటే?

నిజామాబాద్ జిల్లాలోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో మొదటి విడతలో GP ఎన్నికలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం వరకు దాఖలైన నామినేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి. 184 సర్పంచి స్థానాలకు సంబంధించి 140 నామినేషన్లు, 1,642 వార్డు స్థానాలకు సంబంధించి 96 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు.
News November 27, 2025
NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
News November 27, 2025
NZB: చట్టబద్ధత దత్తతనే శ్రేయస్కరం: రసూల్ బీ

చట్టబద్ధత దత్తత శ్రేయస్కరం అని మహిళా శిశు సంక్షేమ శాఖ NZB జిల్లా సంక్షేమ అధికారిణి ఎస్.కె.రసూల్ బీ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం పిల్లల దత్తతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. దివ్యాంగుల పిల్లలను దత్తత తీసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


