News April 13, 2025
రేపు నిర్మల్లో అంబేడ్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు సోమవారం నిర్మల్ జిల్లాకేంద్రంలో అధికారికంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఉదయం 9.30కి మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం అంబేడ్కర్ భవనంలో సభ కొనసాగనుంది. కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అధికారులు హాజరు కానున్నారు.
Similar News
News December 6, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

AP: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2 నుంచి 13 వరకు 9AM నుంచి 12PM వరకు ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి 28 వరకు 9.30AM నుంచి 12.30PM వరకు జరుగుతాయి.
వెబ్సైట్: https://apopenschool.ap.gov.in/
News December 6, 2025
సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.
News December 6, 2025
ESIలో చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ

ESIC తీసుకొచ్చిన SPREEలో కంపెనీల యజమానులు, ఉద్యోగులు చేరడానికి ఈ నెల 31 చివరి తేదీ. దీనివల్ల ఇరువురికీ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ అందుతాయి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగిన యజమానులు www.esic.gov.inలో నమోదు చేసుకోవచ్చు. యజమాని ప్రకటించిన రోజు నుంచే రిజిస్ట్రేషన్ చెల్లుతుంది. మునుపటి రోజులకు తనిఖీ ఉండదు. జీతం నెలకు రూ.21వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులు అర్హులు.


