News February 9, 2025

రేపు నిర్మల్‌లో పర్యటించనున్న త్రిపుర గవర్నర్

image

త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు నిర్మల్ చేరుకొని అక్కడి నుంచి మంజులాపూర్‌లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళనున్నారు.

Similar News

News October 22, 2025

చిత్తూరు CDCMS పర్సన్ ఇన్‌ఛార్జ్ జేసీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(CDCMS)కి అఫిషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా జాయింట్ కలెక్టర్ విద్యాధరిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీ వరకు లేదా తిరిగి ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. గతంలో నియమించిన సుబ్రహ్మణ్యం నాయుడు మృతిచెందిన సంగతి తెలిసిందే.

News October 22, 2025

మంచిర్యాల: ఆరు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. అక్టోబర్ 23, 24, 26, 27, 28, 29 తేదీల్లో ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్‌ల మీదుగా వెళ్తాయి. ఫస్ట్ ఏసీ నుంచి జనరల్ క్లాస్ వరకు అన్ని సౌకర్యాలతో రైళ్లు నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

News October 22, 2025

కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

image

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.