News June 3, 2024

రేపు నెల్లూరులో ట్రాఫిక్ ఆంక్షలు

image

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు టౌన్, రూరల్ పరిధిలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నెల్లూరు రూరల్ DSP పి.వీరాంజనేయ రెడ్డి పేర్కొన్నారు. ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ప్రియదర్శిని కాలేజ్ మీదుగా కనుపర్తిపాడు వెళ్లే మార్గంలో వాహనాలకు అనుమత లేదన్నారు. గొలగమూడి దేవాలయానికి వెళ్లే భక్తులు కాకుటూరు మీదుగా వెళ్లాలని సూచించారు.

Similar News

News September 18, 2024

నెల్లూరు జిల్లాలో పలువురికి వైసీపీ కీలక బాధ్యతలు

image

నెల్లూరు జిల్లాలో పలువురికి కీలక పదవులు అప్పగిస్తూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు- కాకాణి
రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్- ఆనం విజయకుమార్ రెడ్డి
సిటీ ఇన్‌ఛార్జ్- పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు కార్పొరేషన్ అబ్జర్వర్- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ఎంపీ ఇన్‌ఛార్జ్‌- ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి- మహ్మమద్ ఖలీల్

News September 18, 2024

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి

image

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కాకాణికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి పార్టీ మారడంతో జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. తాజాగా ఆయనను నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

News September 18, 2024

మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

image

స్వచ్చతా హి సేవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా పరిషత్ ఆవరణలో బుధవారం కలెక్టర్ ఆనంద్, ZP చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, జిల్లా అధికారులు మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం నిర్వహణ, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డులకు తరలించడం తదితర కార్యక్రమాలు చేపట్టేమన్నారు.