News September 30, 2024
రేపు పత్తికొండకు CM.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామానికి రేపు సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి.బిందు మాధవ్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్‌లో భాగంగా ఆదివారం పుచ్చకాయలమడలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.
Similar News
News October 11, 2024
ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు, పోలీసులు సంతోషంగా జీవించాలని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందేలా విధులు నిర్వర్తించాలని ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు.
News October 11, 2024
ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: కలెక్టర్
ఆడపిల్లల్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో-భేటి పడావో కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలు చేస్తోందన్నారు. ఆడపిల్లలను మంచి చదువులు చదివించాలన్నది ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు.
News October 11, 2024
జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బెళగల్ విద్యార్థి
కోసిగి మండలం దొడ్డి బెళగల్‌కు చెందిన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి సందిప్ ఆగ్రాలో జరిగిన జాతీయ స్థాయి లాక్రోస్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీయాన్ కుమారి అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు.