News January 31, 2025

రేపు పరిగి నియోజకవర్గానికి KTR రాక

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాస్య నాయక్ తండాలో జరిగే అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణలో కేటీఆర్ పాల్గొంటారని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. ఉదయం కార్యక్రమం ఉంటుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News November 21, 2025

BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

నిర్మల్‌ ఏఎస్పీగా సాయికిరణ్

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

వనపర్తి నూతన ఎస్పీగా డి.సునీత‌

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా సునీత‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే సునీత‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఆమె కృషి చేస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.