News January 31, 2025

రేపు పరిగి నియోజకవర్గానికి KTR రాక

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాస్య నాయక్ తండాలో జరిగే అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణలో కేటీఆర్ పాల్గొంటారని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. ఉదయం కార్యక్రమం ఉంటుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News February 18, 2025

వరంగల్ మార్కెట్లో పలు ఉత్పత్తుల ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మంగళవారం వివిధ రకాల ఉత్పత్తులు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. 5,531 మిర్చి ధర రూ.11 వేలు పలకగా, దీపిక మిర్చి రూ.16,200, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే నం. 5 రకం మిర్చి రూ.12 వేలు, ఇండికా మిర్చికి రూ.16,200, మక్కలు(బిల్టీ)కి రూ.2,311 వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News February 18, 2025

SHOCKING.. కుంభమేళాలో నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియా

image

కుంభమేళా వేళ గంగా నదిలో నీటి నాణ్యతపై పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆందోళన రేకెత్తించే అంశాలను వెల్లడించారు. ఈ నీళ్లలో చర్మానికి హానిచేసే కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని నీరు స్నానం చేయడానికి పనికిరాదని NGTకి తెలిపింది. ప్రతి 100mm నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే స్నానం చేయవచ్చని CPCB చెబుతోంది. కాగా దీనిపై విచారణను NGT రేపటికి వాయిదా వేసింది.

News February 18, 2025

రాయలసీమ యూనివర్సిటీ వీసీగా వెంకట బసవరావు

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రొఫెసర్ డాక్టర్ వెంకట బసవరావు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటీఫికేషన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన త్వరలోనే వీసీగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కాగా వెంకట బసవరావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా, పలు విభాగాలకు HODగా విధులు నిర్వహించారు.

error: Content is protected !!