News March 10, 2025
రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళా

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు డీసీసీ కార్యదర్శి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం పరిగిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
Similar News
News January 19, 2026
ఏలూరు: ‘పబ్లిక్ గ్రీవెన్స్‌కు 35 అర్జీలు’

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌కు 35 అర్జీలు అందాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేపర్ లెస్ పద్ధతిలో నిర్వహించామన్నారు. ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.
News January 19, 2026
VJA: అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు

ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 16 రోజులకు గాను హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,60,86,479 నగదు ఆదాయం వచ్చింది. అదనంగా 135 గ్రాముల బంగారం, 2 కిలోల 858 గ్రాముల వెండి లభించాయి. అమెరికా, యూరోప్, యూఏఈ, కెనడా తదితర దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
News January 19, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


