News October 28, 2024
రేపు పులివెందులకు వైఎస్ జగన్ రాక

మాజీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పులివెందులకు రానున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10:45కు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గం.కు పులివెందుల చేరుకోనున్నారని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇక అక్కడి నుంచి 11:40 గం.కు ఆయన ఇంటికి వెళతారని పేర్కొంది.
Similar News
News February 27, 2026
ప్రొద్దుటూరులో బంతి బంతికి పందెం.?

T20 వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు క్రికెట్ ప్రియులకు సందడిగా మారాయి. ఈ సీజన్లో ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలు బంతి బంతికి పందెం నిర్వహిస్తున్నారు. యువత క్రికెట్ బెట్టింగ్ జూదానికి బానిస అయ్యారు. ప్రత్యేక బెట్టింగ్ యాప్‌లతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం వినిపిస్తోంది. ప్రొద్దుటూరు క్రికెట్ మాఫియాతో రాజకీయ నాయకులకు, పోలీసులకు లింక్ ఉందనే ఆరోపణలున్నాయి.
News February 26, 2026
కడప జిల్లాలో ఆహార తనిఖీకి సిబ్బంది ఎక్కడ?

కడప జిల్లా పుడ్ సేప్టీ కంట్రోల్ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో హరిత ఒక్కరే ఉన్నారు. ఈమెకు సహాయంగా అసిస్టెంట్ పుడ్ కంట్రోల్ అధికారి రామచంద్రన్ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలోనే జిల్లా అంతటా ఆహార నాణ్యత తనిఖీలు, శాంపిల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. కార్యాలయంలో సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. ఫీల్డ్ స్టాప్ కొరతతో తనిఖీలు చేయలేకపోతున్నామన్నారు.
News February 26, 2026
కడప: ఇవాళ పరీక్షకు 466 మంది గైర్హాజర్.!

కడప జిల్లాలో గురువారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ ఇంగ్లిష్ పరీక్షలు జరిగాయి. నేడు 16,861 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 16,395 మంది మాత్రమే రాశారు. 466 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 15,792 మంది రాయాల్సి ఉండగా.. 15,300 మంది రాశారు. 402 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,159 మంది రాయాల్సి ఉండగా.. 1,095 మంది రాశారు. 64 మంది రాయలేదు.


